శివుడి నివాసంలో ప్రాణాలు వదిలారు.. అక్కడే వదిలేస్తాం: హైదరాబాద్ పర్వతారోహకుడి కుటుంబసభ్యులు

  • గతవారం ఎవరెస్టులో ప్రాణాలు కోల్పోయిన అరుణ్ కుమార్
  • మృతదేహాన్ని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నామన్న బావమరిది
  • తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి మృతదేహం దెబ్బతింటుందన్న బావమరిది
శివుడి నివాసమైన హిమాలయ పర్వతాలలో అరుణ్ కుమార్ ప్రాణాలు వదిలారు కాబట్టి ఆయన మృతదేహాన్ని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతవారం పర్వతారోహణ ముగించుకుని దిగివస్తుండగా హైదరాబాద్‌కు చెందిన పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ ఎవరెస్టుపై మృతి చెందిన విషయం తెలిసిందే.

మృతుడి బావమరిది సుధీర్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, మృతదేహాన్ని పర్వతంపైనే వదిలి వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని నగరానికి తీసుకువచ్చేందుకు చేపట్టే ప్రక్రియలు ముగిసేసరికి మృతదేహం చాలా వరకు దెబ్బతింటుందని, మంచులో నుంచి దానిని తీసే ప్రక్రియ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. దీనికి బదులు శివుడి నివాసంలోనే వదిలేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఎవరెస్ట్ యాత్రను నిర్వహించిన పయనీర్ అడ్వెంచర్స్ డైరెక్టర్ నివేశ్ కర్కి మాట్లాడుతూ, గత సంవత్సరం కూడా తివారి ఎవరెస్టును అధిరోహించడానికి ప్రయత్నించారని, కానీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 7,200 మీటర్ల ఎత్తు నుంచి వెనక్కి వచ్చారని తెలిపారు. కానీ గతవారం ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించి కిందకు దిగుతుండగా అస్వస్థతకు గురై శిఖరానికి కొంచెం దిగువన ఉన్న హిల్లరీ స్టెప్ సమీపంలో కన్నుమూసినట్లు తెలిపారు.

Arun Kumar
Arun Kumar Tiwari
Everest
Mount Everest
Hillary Step
Mountaineer death
Pioneer Adventures

More Telugu News